ఏపీలో ప్లాస్టిక్ వినియోగం పై నిషేధం…. భారీగా జరిమానాలు…

ఒక్కసారి వాడి పడేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఈ తరహా ప్లాస్టిక్ వినియోగంపై భారీ ఎత్తున జరిమానాలు విధించే దిశగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను సవరిస్తూ గురువారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. నూతన మార్గదర్శకాలకు సంబంధించి అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జరిమానాలు విధించాలని […]
వైసీపీ మూడో ప్లీనరీ..ఈ రోజు షెడ్యూల్ వివరాలు…

గుంటూరు-విజయవాడ రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా వైసీపీ మూడో ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న మొదలైన సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు సమావేశాల షెడ్యూల్ ను ప్లీనరీ కన్వీనర్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేశారు. ఈ రోజున జరిగే సమావేశాల్లో సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, ఎల్లో మీడియా – దుష్టచతుష్టయం అంశాలపై మాట్లాడనున్నారు. పార్టీ అధినేత,సీఎం జగన్ ప్రసంగంతో ఈ ప్లీనరీ సమావేశాలు ముగుస్తాయని అయన తెలిపారు. […]
ఏపీలో వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవమే..!

ఏపీ కోటాలోని 4 రాజ్యసభ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వేణుంబాక విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ 4 నామినేషన్లే వచ్చాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే సమయంలో 4 నామినేషన్లు కూడా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనున్నదని, ఆ గడువు ముగిశాక వీటిపై ఓ ప్రకటన చేయనున్నట్లు తెలిపింది. 4 స్థానాలకు […]
సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పొలిటికల్ మేనేజర్ రామిశెట్టి చిన్నబాబు తెలిపారు. ప్రత్తిపాడు మండలంలోని జగనన్న పాలన మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్బంగా మండల వ్యాప్తంగా భారీగా కేకులు కట్ చేసి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగన్ అన్న పాలన అందిస్తున్నారని అయన తెలిపారు. […]
ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో…. పోలీసుల వాదనపై అనుమానాలెన్నో?

పోలీసుల వాదనపై అనుమానాలెన్నో? ★ వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ఎస్పీ వెల్లడించిన వివరాలకు, క్షేత్ర స్థాయి వాస్తవాలకు కుదరని పొంతన ★ ఈ అనుమానాలకు సమాధానాలు ఉన్నాయా..? ★ అధికారంలో ఉంటే చంపేయటమేనా.? ★ ఇదే ‘నా..’ ప్రజాస్వామ్యం.! (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009) దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా నేత, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) పాత్రకు సంబంధించి పోలీసులు వినిపించిన వాదన పలు అనుమానాలకు తావిస్తోంది. […]
వైకాపా నుండి రాజ్యసభ అభ్యర్థులు వీరే..!

ఏపీలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులకు అధికార వైయస్ ఆర్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ తో భేటి అనంతరం మంత్రి బొత్సా సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి లు సంయుక్తంగా ప్రకటించారు… ఈసందర్బంగా వారు మాట్లాడుతూ…తమ ప్రభుత్వం బీసీ లకు పెద్ద పీట వేసామన్నారు. ఏపీనుండి పోటీ చేసే వైకాపా రాజ్యసభ అభ్యర్థులు వీరే…!రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని తిరిగి కొనసాగించాలని నిర్ణయయించారు. ఇక బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్‌రెడ్డి, బీద మస్థానరావులను రాజ్యసభ […]
రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : సజ్జల

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని అయన స్పష్టం చేశారు. మీడియా లో వస్తున్న ప్రచారాలపై అయన స్పందించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించడం లేదని సజ్జల పేర్కొన్నారు. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రశాంత్ కిశోర్‌తో సీఎం వైఎస్ జగన్‌కి వ్యక్తిగత సాన్నిహిత్యం […]