భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలమవుతున్నది. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఇప్పటివరకు 13 మంది మరణించగా, 23 మంది గల్లంతయ్యారు. వర్షాల కారణంగా 45 వేలకిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో వారందరినీ పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో…
Browsing: International News
ఆర్థికంగా బలమైన భారత్ వంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చోటు లేకుంటే ఎలా..? ఇప్పుడు ఈ విషయంలో ఫ్రాన్స్ సైతం భారత్ కు బాసటగా నిలిచింది. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తాము మద్దతు పలుకుతున్నట్టు ఫ్రాన్స్ మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. నేటి ప్రపంచంలో భద్రతా మండలి కౌన్సిల్ లో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడు మండలి మరింత బలోపేతం…
అమెరికా ఎన్నికల చరిత్రలో ఓ తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. తెలుగు నేపథ్యం ఉన్న అరుణా మిల్లర్ మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. మేరీలాండ్ ప్రజల్లో అపార ఆదరణ కలిగిన అరుణా మిల్లర్… ఆ దేశ మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ అభ్యర్థిగా లెప్ట్ నెంట్ గవర్నర్ పదవి కోసం బరిలో దిగారు. మంగళవారం పోలింగ్ పూర్తి కాగా… బుధవారం వెలువడిన ఫలితాల్లో అరుణా మిల్లర్ లెఫ్ట్ నెంట్…
“హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి..సెలబ్రెటీ కోసం ఎగబడ్డ జనం.. తొక్కిసలాటలో 149 మంది మృతి చెందారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు లక్షకు పైగా జనం హాజరైనారు. ఇరుకైన వీధిగుండా వెళ్తుండగా తొక్కిసలాటలో 149 మంది మృతి చెందగా, 150 మందికిపైగా గాయాలైనాయి. క్షతగాత్రులని చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థర్ జార్జ్ (చార్లెస్- 3) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈక్రమంలో ఆయనకు కొన్ని అసాధారణమైన అధికారాలు దక్కనున్నాయి. రాజుగా పరిపాలన సాగించినంత కాలం ఆయనకు పాస్పోర్ట్ అవసరం లేదు. పాస్పోర్ట్ లేకుండానే ఎక్కడికైనా వెళ్లవచ్చు. అదేవిధంగా దేశీయంగా లైసెన్స్ అవసరం లేకుండానే కారులో ప్రయాణం చేయవచ్చు. ఎవరూ ఆయన్ను ఆపి ప్రశ్నించే అధికారం ఉండదు. ఆయనకు అధికారికంగా వచ్చే ఆస్తులు… బ్రిటన్, వేల్స్ లోని…
బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థర్ జార్జ్ (చార్లెస్- 3) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అయన వయస్సు 73 సంవత్సరాలు . బ్రిటన్ రాజరిక వ్యవస్థలతో అత్యంత ఎక్కువ వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టిన వారిగా రికార్డులకు ఎక్కారు . బ్రిటన్ రాజుగా చార్లెస్- 3 పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఆయన వెంట సతీమణి కెమిల్లా, కుమారుడు విలియంలు ఉన్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు…
🎂 జననాలు 🎂 1838: భక్తివినోద ఠాకూర్, హిందూ తత్వవేత్త, గురువు, గౌడియ వైష్ణవం యొక్క ఆధ్యాత్మిక సంస్కర్త. 1885: టికే మాధవన్, భారతీయ సంఘ సంస్కర్త, పాత్రికేయులు, విప్లవకారులు. 1923: ముదివర్తి కొండమాచార్యులు, రచయిత, పండితులు. 1924: స్వరూపానంద సరస్వతి, భారతీయ మత నాయకులు, స్వాతంత్ర్య సమరయోధులు. 1928: రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. (మ.2013) 1929: గౌర్ గోవింద స్వామి వైష్ణవ మత నాయకులు.…
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. ఆమె తల్లి పోలా మైనో కన్నుమూశారు. ఇటలీలో ఈ నెల 27వ తేదీన మరణించారని, తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ.. ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. పోలా మైనో అంత్యక్రియలను మంగళవారం(ఆగస్టు 30న) జరిపినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
చరిత్రలో ఈరోజు ఆగస్టు – 5 సంఘటనలు : 0070: రోమన్లు, జెరూసలేం లోని రెండవ దేవాలయాన్ని ధ్వంసం చేసారు. 0181: ఆకాశంలోని, కేసియోపియా రాశిలో సూపర్ నోవాని చూసారు. సూపర్ నోవా అంటే ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ, ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ, పేలిపోయే నక్షత్రం) [1] 1693: డోమ్ పెరిగ్నాన్, షాంపేన్ అనే సారాయిని కనిపెట్టాడు. పాశ్చాత్య దేశాలలోని ఆడవాళ్ళు ఈ షాంపేన్ని ఎక్కువగా తాగుతారు.…
బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన నేత రిషి సునక్ బ్రిటన్ ప్రజలను, కన్జర్వేటివ్ పార్టీ నేతలను బాగా ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో భాగంగా రిషి సునాక్ తన కుటుంబంతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తన భార్య, అక్షతామూర్తి, ఇద్దరు కుమార్తెలు కృష్ణ, అనౌష్కలతో కలిసి ప్రచార…