ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వైసీపీ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం . అందులో భాగంగానే కాంగ్రెజ్ సీనియర్ నేత రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరనున్నారు. అందుకు ముహూర్థం కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం . ఉండవల్లి చేరిక వైసీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం రానుంది. అయితే ఉండవల్లి ఈనెల 26న వైఎస్ జగన్మో హన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక అదేబాటలో మరికొంత మంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరునున్నట్లు సమాచారం .
ఫలించింన జగన్ వ్యూహం :
జగన్ వ్యూహం ఫలించినట్లుగా కనిపిస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అస్త్రాన్ని ప్రయోగిస్తూ పార్టీ శ్రేణులో నూతనోత్తేజం నింపుతున్నారు. ఉగాది తర్వాత జిల్లాల్లో పర్యటిం చేందుకు సిద్ధం అవుతున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ పై ప్రణాళికలు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి శైలజనాథ్ ఇటీవలే వైసీపీలో చేరారు. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి వైసీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు . 2014 నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.