Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఏపీలో నేటి నుంచి మద్యం షాపులు మూసివేత…!

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మద్యం షాపులు మూతపడ్డాయి .నిన్నటితో ( సెప్టెంబర్ 30, 2024 ) వైన్ షాపు ఉద్యోగుల కాంట్రాక్టు కాలం పూర్తవ్వటంతో చాలా చోట్ల వైన్ షాపులు మూతపడ్డాయి. రాష్ట్రంలోని విజయనగరం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు తదితర జిల్లాలో వైన్ షాపులు మూసేసారు. వైన్ షాపులు మళ్ళీ  ఎప్పుడు తెరుచుకుంటాయన్నది సమాచారం లేదు. అయితే, మరో 10రోజులు వైన్ షాపులు తెరవాలని ప్రభుత్వం కోరినా అందుకు ఉద్యోగులు అంగీకరించలేదు. ప్రభుత్వం ప్రైవేట్ వైన్ షాపులు తెరుస్తున్న క్రమంలో తమ ఉద్యోగాలు ఉండవని.. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు ( అక్టోబర్ 1, 2024 ) నుండి విధులకు దూరంగా ఉన్నారు. ఒక్కసారిగా వైన్ షాపులు మూతపడటంతో తాగడానికి మందు ఎక్కడా దొరకక మందుబాబులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పక్క ఊళ్లలో కూడా వైన్ షాపులు మూసి ఉండటంతో మద్యం ప్రియులు నిరాశకు గురవుతున్నారు. ఇక రాష్ట్రంలో వైన్ షాపులు మూతపడటంతో చేసేదేమిలేక మద్యం ప్రియులు బార్ల వద్దకు “క్యూ”  కడుతున్నారు.  బార్లలో అధిక ధరలకు మద్యం కొంటున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,240 పైగా మద్యం షాపులు మూతపడ్డట్టు తెలుస్తోంది. కాగా..  అక్టోబర్ 12 నుండి ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రకారం వైన్ షాపులు, బార్లు తెరుచుకోనున్నాయి.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌