Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం..: మంత్రి నాదెండ్ల

పెట్రోల్, డీజిల్ ను దొడ్డిదారిన పంపిస్తూ. .. కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఆంధ్ర ప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్నపెట్రోల్, డీజిల్ కొరత, అక్రమాలపై  అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి నాదెండ్ల సమీక్ష నిర్వహించారు. అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఆధికారులనుహెచ్చరించారు.

ఈ సందర్బంగా పెట్రోల్ బంకుల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. ఇంధన లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలు చేస్తున్న ‘రేషన్ పద్ధతి’ని కొనసాగించాలని సూచించారు. ముఖ్యంగా ఆక్వా, వరి రైతులకు వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. కొన్ని బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వాహనాలకు ఇంధనం పోయడానికి నిరాకరిస్తున్న బంకులపై 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. గతంతో పోలిస్తే చమురు కంపెనీల నుంచి ఇంధన సరఫరా కూడా మెరుగుపడిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి  అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఇంధన కొరతపై తప్పుడు వార్తలు వ్రాస్తూ… ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై  కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖను మంత్రి నాదెండ్ల ఆదేశించారు.

RSS
Follow by Email
Latest news