Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రెండు తెలుగు రాష్ట్రాల్లో దంచి కొడుతున్న ఎండలు

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ  నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్‌, భద్రాద్రి, కొమురంభీం జిల్లాల్లో 44 డిగ్రీలు, సిద్దిపేట, మెదక్‌, నారాయణపేట, నాగర్ కర్నూలు, సూర్యాపేట, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో 43 డిగ్రీలు, ఖమ్మం, భూపాలపల్లి, హనుమకొండ, గద్వాల, సిరిసిల్ల, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌లో 43 డిగ్రీలు, రంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మేడ్చల్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అలాగే ఆంధ్రప్రదేశ్ సైతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. మర్కాపురం, నంద్యాలలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కడప, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో 43 డిగ్రీలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధ్యమైనంత వరకు ఉదయం 10 గంటలలోపు ఏమైనా పనులుంటే చూసుకోవాలని,  అలాగే సాయంత్రం 6 దాటినా తరువాతనే ఇళ్ళనుండి ప్రజలు బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు.

RSS
Follow by Email
Latest news