భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న న్నికల ఫలితాలపై ‘ఎగ్జిట్ పోల్’ అంచనాలను ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో, సాయంత్రం 6:30 గంటల నుంచి వివిధ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ ఎన్నికల ఫలితాలపై ఓటర్లు ఏపార్టీకి పట్టం కట్టనున్నారనే అంశంపై ‘ఎగ్జిట్ పోల్’ అంచనాలు విడుదలయ్యాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ మరియు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే వివిధ జాతీయ, ప్రాంతీయ సర్వే సంస్థలు తమ విశ్లేషణలను వెల్లడించాయి.
పశ్చిమ బెంగాల్ :
పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలపై సీఎన్‌ఎన్-న్యూస్18 కోసం వోట్‌వైబ్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం చూపించింది.
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్.. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కూటమి 125 -140 సీట్లు, బీజేపీ 146-161 సీట్లు గెలుచుకోనున్నాయని పేర్కొంది. ఎగ్జిట్ పోల్ బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం చూపించింది. 152 స్థానాలకు గాను బీజేపీ 88 నుంచి 98 సీట్లు సాధించే అవకాశం ఉందని, టీఎంసీ+ కూటమి 51 నుంచి 61 స్థానాలకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు కేవలం 2 నుంచి 4 సీట్లు మాత్రమే దక్కే అవకాశముందని పేర్కొంది.
తమిళనాడు :
పీపుల్స్ ఇన్‌సైట్ పోల్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, తమిళనాడులో మొత్తం 234 మంది సభ్యులున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమికి 122 – 140 సీట్లు, ఏడీఎంకే కూటమికి 60 – 70 స్థానాలు, విజయ్ పార్టీ టీవీకేకి 30 – 40 సీట్లు, ఇతరులు 0 – 4 సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది.
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, తమిళనాడులో డీఎంకే కూటమికి 122-132 సీట్లు, ఏడీఎంకే కూటమికి 87-100 సీట్లు, టీవీకే 10-12 సీట్లు, ఇతరులు 0 – 6 సీట్లు గెలుచుకోనున్నాయని ప్రకటించాయి.
యాక్సిస్ మై ఇండియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ప్రకారం.. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ 98 నుంచి 120 సీట్ల మధ్య గెలుచుకుని అధికారం చేపట్టేందుకు చెరువలోకి వస్తుందని అంచనా వేసింది. అధికారంలో ఉన్న డీఎంకే నేతృత్వంలోని కూటమి 92 నుంచి 110 సీట్లు, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని కూటమి 22 నుంచి 32 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది. అయితే మిగిలిన అన్ని సర్వేలు మాత్రం విజయ్‌కు అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదని అంచనా వేస్తున్నాయి.
అస్సాం లో : అన్ని సర్వేలు కూడా బీజేపీ కూటమి హవా కొనసాగుతుందని స్పష్టం చేశాయి.
జేవీసీ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ : మొత్తం 126 మంది సభ్యులున్న అస్సాంలో ఎన్డీఏ 88 నుండి 101 సీట్లు గెలుచుకుంటుందని జేవీసీ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి 23 నుండి 33 సీట్లు, ఇతరులకు 2 నుండి 5 సీట్లు లభించే అవకాశం ఉందని ప్రకటించింది.
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ : అస్సాంలో బీజేపీ కూటమి 85-95 సీట్లు, కాంగ్రెస్ కూటమి 25- 32 సీట్లు రావొచ్చని అంచనా వేసింది.
కేరళ : కూరలో అన్ని సర్వేలు యూడీఎఫ్ కూటమికే పట్టం కట్టాయి .
మొత్తం 140 మంది సభ్యుల కేరళ అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే 71 స్థానాలు అవసరం. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం UDF 70 నుంచి 80 స్థానాల మధ్య గెలిచే అవకాశం ఉందని అంచనా.
యాక్సిస్ మై ఇండియా: ఎల్డీఎఫ్ 49-62, యూడీఎఫ్ 78-90, బీజేపీ కూటమి 0-3.
పి-మార్క్: ఎల్డీఎఫ్ 62-69, యూడీఎఫ్ 71-79, బీజేపీ కూటమి 1-4.
మ్యాట్రిజ్: ఎల్డీఎఫ్ 60-65, యూడీఎఫ్ 70-75, బీజేపీ కూటమి 3-5.
పీపుల్స్ పల్స్: ఎల్డీఎఫ్ 55-65, యూడీఎఫ్ 75-85, బీజేపీ కూటమి 0-3.
పుదుచ్చేరి :
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరిగింది. ఇక్కడ మెజారిటీ మార్కు 16.
యాక్సిస్ మై ఇండియా: బీజేపీ కూటమి 16-20, డిఎంకె-కాంగ్రెస్ కూటమి 6–8 సీట్లు, టివికె+ 2–4 సీట్లు, ఇతరులు 1–3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.










