Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మైదానంలోనే కంటతడి పెట్టిన నీతా అంబానీ

ముంబై ఇండియన్స్ యజమాని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ మైదానంలోనే కంటతడి పెట్టారు. సొంత మైదానం వాంఖెడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు సృష్టించిన పరుగుల విధ్వంసం చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆమె తన ఎమోషన్‌ను ఆపుకోలేకపోయారు. 244 పరుగులభారీ లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. దింతో మైదానంలో పరుగుల వరదపారింది. వారిని అడ్డుకోలేక ముంబై బౌలర్లు చేతులెత్తేయడంతో కేవలం 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అద్భుత విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు పవర్‌ప్లేలోనే వీరిద్దరూ వికెట్ నష్టపోకుండా 92 పరుగులు జోడించారు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ జోడీ కేవలం 8 ఓవర్లలోనే 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఆరో సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి, డేవిడ్ వార్నర్ – శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు.

ముంబై ప్రధాన బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనూ హెడ్, అభిషేక్ భారీ షాట్లు ఆడారు. వారి దూకుడుకు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిస్సహాయంగా కనిపించగా, ఫీల్డర్లు కూడా క్యాచ్‌లను జారవిడిచారు. ఈ విధ్వంసకర బ్యాటింగ్ చూసే నీతా అంబానీ తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేయడం తెలిసిందే.

RSS
Follow by Email
Latest news