టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.. విజయ్ దేవరకొండ, రష్మికతో పాటు అల్లు శిరీష్ వివాహం చేసుకున్నారు .ఇక త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నఫలంగా నటి మెహ్రీన్ పిర్జాదా సోషల్ మీడియా వేదిక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

అర్ష్ ఔలఖ్తో తన వివాహం జరిగినట్లు ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఇలా సైలెంట్ గా ఈమె పెళ్లి పీటలు ఎక్కడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత సన్నిహితులు కొద్ది మంది బంధువుల సమక్షంలో ఏప్రిల్ 26న మెహరీన్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈమె తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలతో పాటు మెహందీ సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

హిమాచల్ ప్రదేశ్లోని చైల్లో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో మెహరీన్ లేత గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోతూ కనిపించగా.. అదే రంగు దుస్తుల్లో అర్ష్ ఔలఖ్ ఆకట్టుకున్నారు (Mehreen Wedding). ఈ కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెహరీన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాల్లో అలరించారు.











