Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఆర్థికంగా బలమైన భారత్ వంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చోటు లేకుంటే ఎలా..? ఇప్పుడు ఈ విషయంలో ఫ్రాన్స్ సైతం భారత్ కు బాసటగా నిలిచింది. భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తాము మద్దతు పలుకుతున్నట్టు ఫ్రాన్స్ మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. నేటి ప్రపంచంలో భద్రతా మండలి కౌన్సిల్ లో మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడు మండలి మరింత బలోపేతం అవుతుంది’’ అని ఐక్యరాజ్య సమితిలో ఫ్రాన్స్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాతాలీ బ్రోడ్ హర్ట్ శుక్రవారం ప్రకటన చేశారు.

యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్లీనరీ సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడారు. భద్రతా మండలిలో 25 సభ్య దేశాలు ఉండాలన్న అభిప్రాయాన్ని వినిపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కేవలం ఐదు దేశాలకే పరిమితం అయితే ఎలా? అది మిగతా ప్రపంచానికి ఏ విధంగా ఆమోదనీయం అవుతుంది? అని ప్రశ్నించింది. కొత్త ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న దేశాలను గుర్తించి, వాటికి మండలిలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఫ్రాన్స్ డిమాండ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest news