Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మేనిఫెస్టోలోని 5 హామీలను తొలిరోజే నెరవేరుస్తాం : రాహుల్

కర్ణాటక శాసనసభ కు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ఐదు హామీలతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ప్రజలు పట్టం కట్టారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపటి క్రితం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, అందుకు వారికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎన్నికలకు ముందు ప్రకటిన విధంగా తొలి రోజునే ఎన్నికల మేనిఫెస్టో లోని ఐదు హామీలను నెరవేరుస్తామని చెప్పారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదు హామీలు ఇవే :

  • గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
  • గృహలక్ష్మి పథకం కింద 1.5 కోట్ల గృహిణులకు నెలకు రూ. 2 వేల ఆర్థిక సహాయం
  • అన్న భాగ్య పథకం కింద పేద కుటుంబాలకు 10 కిలోల ఉచిత బియ్యం
  • యువనిధి యోజన కింద నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 3 వేలు, డిప్లొమా చదివిన వారికి నెలకు రూ. 1,500 నిరుద్యోగభృతి
  • ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్