Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

చైనీయుడ్ని రక్షించిన భారత కోస్ట్ గార్డ్…!

చైనా నుంచి అరేబియా మీదుగా యూఈఏ వెళ్తున్న నౌకలో బుధవారం రాత్రి ఓ ఘటన జరిగింది. ఆ నౌక సిబ్బంది అయిన వీగ్‌యాంగ్‌ గుండెపోటుకు గురైయ్యారు. ఈ క్రమంలో నౌక సిబ్బంది సమీప తీర ప్రాంతం ముంబయిలోని మారిటైమ్‌ రెస్క్యూ కో-ఆర్డినేషన్‌ కేంద్రానికి ఎమర్జెన్సీ మెసేజ్ అందించారు. విషయం తెలిసిన భారత కోస్ట్‌ గార్డ్‌ సాహసోపేతమైన చర్యను నిర్వహించారు. అరేబియా సముద్రంలో గుండెపోటుకు గురైన ఆ చైనీయుడ్ని రక్షించింది. సముద్ర తీరానికి 200 కి.మీ దూరంలో ఉన్న నౌక వద్దకు భారత కోస్ట్‌గార్డ్‌ ALHMK-3 హెలికాప్టర్‌ ద్వారా ఆపరేషన్‌ విజయవంతంగా నిర్వహించింది. ప్రతికూల వాతావరణం మధ్య బాధితుడ్ని ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా సమీప ఆస్పత్రికి తరలించి అతడి ప్రాణాలను కాపాడింది.

RSS
Follow by Email
Latest news