Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బ్రిట‌న్ నూత‌న రాజుగా చార్లెస్ – 3

బ్రిట‌న్ నూత‌న రాజుగా చార్లెస్ ఫిలిప్ అర్థ‌ర్ జార్జ్ (చార్లెస్- 3) అధికారికంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం అయన వయస్సు  73 సంవత్సరాలు .  బ్రిట‌న్ రాజరిక వ్య‌వ‌స్థ‌ల‌తో అత్యంత ఎక్కువ వ‌య‌సులో రాజుగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వారిగా రికార్డుల‌కు ఎక్కారు .  బ్రిట‌న్ రాజుగా చార్లెస్‌- 3 ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న వెంట స‌తీమ‌ణి కెమిల్లా, కుమారుడు విలియంలు ఉన్నారు.

భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈరోజు అనగా.. శ‌నివారం మ‌ధ్యాహ్నం లండ‌న్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఆక్సెష‌న్ కౌన్సిల్ ఆయ‌న‌ను బ్రిట‌న్ రాజుగా ప్ర‌కటించింది.  బ్రిట‌న్ రాణిగా మొన్న‌టిదాకా కొన‌సాగిన ఎలిజ‌బెత్- 2 గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆమె పెద్ద కుమారుడిగా ఉన్న చార్లెస్‌- 3ని బ్రిట‌న్ రాజుగా కౌన్సిల్ ప్ర‌క‌టించింది.

RSS
Follow by Email
Latest news