Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సంఘం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా… చల్ల హరిశంకర్

తెలంగాణ రాష్ట్ర పొరసరఫరాలు మరియు బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ ని కలిసిన మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్. ఈసందర్బంగా మంత్రికి పూల మొక్కను ఇచ్చి కృతజ్ఞతలు తెలియ చేశారు.  మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు, అందుకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి  కృతజ్ఞతలు తెలుపుకున్నాను అని అన్నారు.

ఈ సందర్బంగా హరి శంకర్ మాట్లాడుతూ…తనను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంపీ( రాజ్య సభ) వద్దిరాజు రవిచంద్ర గారికి ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంఘం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

మంత్రిని కలిసిన వారిలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, రాష్ట్ర అపెక్స్ కమిటీ కన్వీనర్ పుత్తం పురుషోత్తం రావు పటేల్, కరీంనగర్ కార్పొరేటర్ బండారి వేణు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైద్యం వెంకటేశ్వర్లు, కోశాధికారి విష్ణు జగత్, రాష్ట్ర జర్ణలిస్ట్ ల ఫోరం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, కాపు సంఘం రాష్ట్ర నాయకులు వినోద్ తదితరులు కలిశారు.

RSS
Follow by Email
Latest news