Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

జులై 3న విడుదల కానున్న “రావు బహదూర్”

దర్శకుడు వెంకటేశ్‌ మాహా రూపొందించిన ఈ సైకాలజికల్ డ్రామా చిత్రం ‘రావు బహదూర్’. ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్లో కలకాలం గుర్తుండిపోయే చిత్రమని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కొనియాడారు. దర్శకుడు వెంకటేశ్ మాహా వెండితెరపై సృష్టించిన ప్రపంచం అద్భుతంగా ఉందన్న అన్నారు. జూన్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం, అనివార్య కారణాలతో వాయిదా పడి, ఇప్పుడు జులై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

భారీ సెట్టింగులు, పురాతన కాలం నాటి రాచరిక నేపథ్యం, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల కోసం చేసిన సన్నాహాలు సినిమా రేంజ్‌ను చూపిస్తున్నాయి. గత యుగానికి చెందిన ఓ రహస్యాలు, వారసత్వ కథాంశంతో ఈ సైకాలజికల్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మహేశ్‌ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ‘జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన స్పందనను మహేశ్ బాబు పంచుకున్నారు. మన అంతరాత్మలోకి, ఆలోచనల్లోకి బలంగా చొచ్చుకెళ్లే సినిమా అని , వింతగా, అందంగా ఉంటూనే ఎమోషన్స్‌తో సాగే కథ ఇది అని మహేశ్ తెలిపారు. చిత్ర బృందం మొత్తం ప్రాణం పెట్టి పని చేసిందని అభినందించారు. ఇక హీరో సత్యదేవ్‌ ఆ పాత్రలో నటించడం కాదు జీవించారని కొనియాడారు. అలాగే హీరోయిన్ దీపా థామస్‌ సైతం ఎంతో సహజమైన నటన కనబరిచిందని మహేష్ బాబు అన్నారు.

RSS
Follow by Email
Latest news