Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

“ఆహా”లో అదరగొడుతున్న “ఊరెళ్ళిపోతా మామ”

మహేష్ బాబులా మంచి అందగాడైన యువ కథానాయకుడు శ్రీమానస్… మహేష్ బాబుకు వీరాభిమాని, అతను పాత సినిమాల నుంచి.. నిజ జీవితం నుంచి నిరంతరం వరకు నేర్చుకుంటూ… తనను తాను నటుడిగా… వ్యక్తిగా తీర్చిదిద్దుకుంటున్నానని వర్తమాన యువ కథానాయకుడు శ్రీ మానస్ అంటున్నాడు. పక్కా హైదరాబాద్ పిల్లగాడైన శ్రీ మానస్ నటించిన “ఊరెళ్ళిపోతా మామ” చిత్రం అసలు సిసలు తెలుగు ఓటిటి “ఆహా”లో అదరగొడుతుంది. అసాధారణ స్పందన అందుకుంటోంది!!

మెరీనా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వరుణ్ శుభలేఖ సుధాకర్, మహేష్ విట్టా, టిఎన్ఆర్, మ్యాడి, సెహరా పద్మాజయంతి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అంజన్ రెడ్డి దర్శకత్వంలో తాడిపత్రి వెంకట కొండారెడ్డి- జి దామోదర్ రెడ్డి – ఎస్ మారుతి ప్రసాద్ -కె హిమాన్విత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన “ఊరెళ్ళి పోతా మామా” చిత్రం “ఆహా”లో అనూహ్య విజయం సాధిస్తుండడం అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తోందని శ్రీ మానస్ తెలిపారు. ఈ విజయం ఉత్సాహంతో ఉరకలు వేస్తోందని అన్నారు.

శర్వానంద్, శ్రీ విష్ణు వంటి హీరోలను పరిచయం చేసిన బహుముఖ ప్రతిభాసాలి దొరైరాజ్ దర్శకత్వంలో రూపొంది.. కరోనా కష్టకాలంలోనూ ఘన విజయం సాధించిన “పటారుపాలెం ప్రేమకథ” తో హీరోగా పరిచయమైన శ్రీ మానస్… తనను హీరోగా పరిచయం చేసిన దొరైరాజ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు.

“పటారుపాలెం ప్రేమకథ”తో హీరోగా తన ప్రతిభను ప్రకటించుకుని… “ఊరెళ్ళిపోతా మామా” సాధిస్తున్న అనూహ్య విజయాన్ని అమితంగా ఆస్వాదిస్తున్న శ్రీ మానస్… త్వరలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న “పొట్లగిత్త” చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. వెంకట్ ఈ చిత్రానికి దర్శకుడు!!

అమ్మ-నాన్న లేని లోటును భర్తీ చేస్తూ తనను నిరంతరం వెన్ను తట్టి ప్రోత్సహించే “అన్నయ్య – వదినమ్మ – అక్కలు” గర్వపడేలా తన కెరీర్ ను తీర్చిదిద్దుకుంటానని చెబుతూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యే ఈ అచ్చ “తెలంగాణ పోట్లగిత్త” హీరోగా మాత్రమే కాదు.. ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే “క్యారెక్టర్స్ రోల్స్” చేయడానికి సైతం తాను సిద్ధమేనంటున్నాడు.

RSS
Follow by Email
Latest news