Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ హ్యాక్‌.. టీపీబీవో,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు వాయిదా …

  • నేడు జరగాల్సిన టీపీబీవో పరీక్ష వాయిదా…
  • ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలు వాయిదా…
  • పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు అనుమానిస్తున్న అధికారులు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) వెబ్ సైట్ హ్యాక్ అయినట్టు అధికారులు గుర్తించారు. దాంతో, రెండు ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో) పరీక్ష, ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్ లైన్ లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామక పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ హ్యాక్ అయినట్టుగా అనుమానాలున్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కమిషన్ తెలిపింది. అయితే, హ్యాకింగ్‌ అంశాలపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ, కమిషన్ మాత్రం స్థానిక బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. హ్యాకింగ్ లో రెండు పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్‌ అయినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హ్యాకింగ్‌ ఎప్పుడు జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. కానీ, టీపీబీవో పరీక్షకు ఒకరోజు ముందు హ్యాక్ విషయాన్ని వెల్లడించి, పరీక్ష వాయిదా వేస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది.

RSS
Follow by Email
Latest news