Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్

రష్యా, చైనా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక సామర్థ్యాన్ని తాను పునర్నిర్మించి బలోపేతం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అమెరికా లేకపోతే నాటోను ఎవరూ ఖాతరు చేయరని, రష్యా, చైనా గౌరవించే, భయపడే ఏకైక దేశం అమెరికా మాత్రమేనని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

గ్రీన్‌లాండ్‌ను అమెరికా సొంతం చేసుకుంటే నాటో కూటమి చీలిపోయినట్టేనని డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, పోలాండ్ తదితర నాటో దేశాలు హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. నాటో దేశాలన్నీ తమ మిత్రులేనని, తాను జోక్యం చేసుకోకపోతే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేదని అన్నారు. తాను ఒంటిచేత్తో ఎనిమిది యుద్ధాలను ఆపానని మళ్లీ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ నోబెల్ బహుమతి విషయంలో నార్వే మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌