Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చెయ్యాలి

ఎల్కతుర్తి మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి వారి ధాన్యం తడిసి ముద్దయింది. ఏ షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చెయ్యాలని ఎల్కతుర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి డిమాండ్ చేశారు. మండల పరిధిలో తడిసిన అధాన్యాన్ని అయన సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన వడ్లు వెంటవెంటనే కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ అకాల వర్షాలు కురిస్తే రైతులు ఆగం అవుతారని సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినాము,, కానీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు మాకెలాంటి సంబంధం లేదు మేము కేవలం టోకెన్ రాసి ఇవ్వడం మాత్రమే మా బాధ్యత అని సమస్యనుండి తప్పించుకున్నారని విమర్శించారు.

అధికార పార్టీ నాయకులు కానీ, సంబంధిత అధికారులు కానీ సకాలంలో స్పందించలేదన్నారు. ఫలితంగా… ఈరోజు అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి మండల వ్యాప్తంగా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు తడిసిపోయి లబోదిబోమంటున్నారు, ఈరోజు ఈ దుస్థితికి కారణం ఎవరు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చిరంజీవి ప్రశ్నించారు., ఇప్పటికైనా మండల వ్యాప్తంగా రైతుల వద్ద తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏ షరతులు లేకుండా వెంటవెంటనే కొనుగోలు చెయ్యాలని మండల భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

RSS
Follow by Email
Latest news