Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ : వైయస్ షర్మిల

ఖమ్మం జిల్లాలో నేడు వైయస్ షర్మిల తన పాదయాత్ర కొనసాగింది. ఈక్రమంలో తెలంగాణ సర్కారు ఫై నిప్పులు చెరిగింది. ఈరోజు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయి గూడెం లో వైయస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..కెసిఆర్ ను ఎందుకు ముఖ్యమంత్రి చేశాము అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారని ఆమె అన్నారు. కెసిఆర్ తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇది బంగారు తెలంగాణ కాదు.. బీర్ల తెలంగాణ- బార్ల తెలంగాణ అయిందని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దానికి కారణం  కేసీఆర్ కదా అని ప్రశ్నించారు. ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలు కావా? ఈ పాపం ముమ్మాటికి కెసిఆర్ దే అని ఆరోపించారు. ప్రతి ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్