Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ప్రారంభమైన బోనాలు

ఆషాఢమాసంలో ప్రారంభమైయ్యే బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైనాయి. ఆషాడమాసం తొలి ఆదివారంనాడు గొల్కోండ కోటాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి.  శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని తరలివచ్చే మహిళలతో బోనాల పండగ అంగరంగవైభవంగా జరిగాయి. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివచారు.  అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. విశాలా బజార్ లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు  జరిగింది. బడా బజార్ అనంతచారి ఇంటి నుంచి జగదాంబిక అమ్మవారి పూజ, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చేశారు.

లంగర్ హౌస్ నుంచి ప్రభుత్వం తరఫున సమర్పించే పట్టు వస్త్రాలు.. తొట్టెలు పోతరాజుల ఊరేగింపుతో ప్రారంభమయింది.  బంజారీ దర్వాజా నుంచి గోల్కొండ సర్కారీ బోనం ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఇవన్నీ సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల మధ్య గోల్కొండ కోట గేటు దగ్గరికి చేరకున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మళ్లీ గోల్కొండలోనే చివరి బోనంతో ఉత్సవాలు ముగుస్తాయి. గోల్కొండ బోనాలకు తరలివచ్చే భక్తుల కోసం కోటలో ఏర్పాట్లు చేశారు. కోట ప్రారంభం నుంచి బోనాలు సమర్పించే ప్రాంతం దాకా తాగునీటి పాయింట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. మరోవైపు ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా హెల్త్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు.

పండుగ జరిగే అన్ని రోజులు కోటలోకి వెళ్లేందుకు భక్తులకు ఉచిత ప్రవేశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్‌, హెల్త్‌, ట్రాఫిక్‌, ఎలక్ట్రిసిటీ అధికారులు  పాల్గొంటారు. గోల్కొండ కోటలో మొత్తం 20 మొబైల్ టాయిలెట్లు, ఐదు హెల్త్ క్యాంపులు, మూడు అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు.

RSS
Follow by Email
Latest news