Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి..

అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియాగాంధీ వీడియో సందేశం విడుద‌ల చేశారు. ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ భావోద్వేగ సందేశాన్ని ఆమె పంపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సోనియా గాంధీ రావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రిత్యా రాలేకపోయారు. దీంతో ఆమె తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ వీడియో సందేశం పంపించారు. ప్రియమైన సోదర సోదరీమణులారా.. నేను మీ దగ్గరకు రాలేకపోతున్నా. కానీ మీరు ఎప్పుడూ నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు.

నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా…తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలను కుంటున్నా.. దొరల తెలంగాణని ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలి. దానిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ మాట్లాడారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే… మీకు మంచి ప్రభుత్వం (కాంగ్రెస్ ) అధికారంలోకి రావాలని ఆఅన్నారు. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు. మీరు చూపిన ఈ ప్రేమ, అభిమానాలకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు నా విన్నపం ఒక్కటే… మార్పు కావాలంటే కాంగ్రెస్‌కి ఓటేయండి. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ తెలంగాణ ఓటర్లకు పిలుపునిచ్చారు సోనియా గాంధీ.

RSS
Follow by Email
Latest news