Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై పోరాటాలు : సుభాన్

ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని  (TNSF) రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా కేంద్రంలోనిTNGO భవనంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా TNSF- రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ KCR హయంలో సమస్యల నిలయంగా ప్రభుత్వ పాఠశాలలు నిలిచాయని ఆయన ఆరోపించారు.  ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 40 రోజులు కావస్తున్న ఇప్పటివరకు విద్యార్థులకు పూర్తిగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, స్కూల్ గ్రాండ్స్ నిధులు ఇవ్వకుండా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ  ప్రభుత్వ విద్యారంగాన్ని తుంగలో తొక్కారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తరగతులు బోధించడానికి టీచర్లు లేక ఇంగ్లీష్ మీడియం కుంటుపడిందని వారన్నారు, తక్షణమే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసి విద్యా వాలంటరీలను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. నేడు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి స్కావెంజర్స్ ను నియమించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ జూనియర్,డిగ్రీ,కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలుచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో TNSF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో TNSF రాష్ట్ర కార్యదర్శి ఐజ తిరుమలేష్, జిల్లా ఉపాధ్యక్షులు గంజిపేట రాకేష్, అల్లంపూర్ నియోజకవర్గం కన్వీనర్ రవీంద్రబాబు, పట్టణ కార్యదర్శి సతీష్, పరశురాముడు, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news