Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సన్‌రైజర్స్ జట్టులోకి డేవిడ్ పైన్ స్థానంలో దక్షిణాఫ్రికా  స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇవాళ ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి దక్షిణాఫ్రికా  స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీ చేరాడు. డేవిడ్ పైన్ గాయం కారణంగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో గెరాల్డ్‌కు సన్‌రైజర్స్ అవకాశం ఇచ్చింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీ ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

గెరాల్డ్ కోయిట్జీకి ఐపీఎల్‌ ఆడిన అనుభవం ఉంది. వేగంతోపాటు నిలకడగా లైన్ అండ్‌ లెంగ్త్ వేయడం గెరాల్డ్ ప్రత్యేకత. ఈయన గతంలో ముంబయి ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున 14 మ్యాచులు ఆడాడు. ఇందులో 15 వికెట్లు తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. ఓవరాల్‌గా మొత్తం అతడి ఖాలో 67 అంతర్జాతీయ వికెట్లు ఉన్నాయి.

కమిన్స్‌ రాకతో …. మరింత బలోపేతం కానున్న బౌలింగ్‌ విభాగం

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ను వెంటాడుతోన్న సమస్య బౌలింగ్‌. గత మ్యాచ్‌లో భారత దేశవాళీ కుర్రాళ్లు ప్రఫుల్ హింగే, సకిబ్ సత్తా చాటి జట్టును గెలిపించారు. అయితే, గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించిన పాట్ కమిన్స్‌ జట్టులో చేరితే.. బౌలింగ్‌ విభాగం మరింత బలోపేతం కానుంది. కోయిట్జీ బ్యాటింగ్‌లోనూ రాణించ గల సత్తా ఉన్నా ప్లేయరే. ఏప్రిల్ 21న దిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది.

RSS
Follow by Email
Latest news