Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తనదైన మిమిక్రీతో ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రజల పొట్టలు చెక్కలు చేసే ప్రముఖ నటుడు శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ, చైతన్య ప్రియ ముఖ్య తారాగణంగా రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ – రామ్ నాథ్ ముదిరాజ్ మూవీస్ పతాకాలపై రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వంలో చందక రాజ్ కుమార్ – సి.హెచ్.రామ్ నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న హర్రర్ రొమాంటిక్ థ్రిల్లర్ “రెంట్”. “నాట్ ఫర్ సేల్” అన్నది ఉప శీర్షిక. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ విభిన్న కథాచిత్రం గోవా, దేవఘడ్ తదితర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ, చైతన్యప్రియ, దర్శకుడు రఘువర్థన్ రెడ్డి, నిర్మాతలు చందక రాజ్ కుమార్, సి.హెచ్.రామ్ నాథ్, సినిమాటోగ్రాఫర్ హజరత్ (వలి), సంగీత దర్శకులు డి.ఎస్.ఆర్ పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు. హర్రర్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న “రెంట్” నాట్ ఫర్ సేల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని నటీనటులు తెలిపారు. గోవాలో జరిగే మూడో షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని నిర్మాత చందక రాజ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బాలాజీ శ్రీను, కో – డైరెక్టర్: దాసరి గంగాధర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: డి.ఎస్.ఆర్, సినిమాటోగ్రఫీ: హజరత్ (వలి), నిర్మాతలు: చందక రాజ్ కుమార్ – సి.హెచ్.రామ్ నాథ్, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్సకత్వం: రఘువర్ధన్ రెడ్డి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest news