Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై సమీక్షా సమావేశం

వైజాగ్ ఎకనమిక్ రీజియన్(వీఈఆర్) అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రుషికొండ ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ లో జరిగిన మొదటి సమీక్షా సమావేశం జరిగింది . ఈ సమావేశంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వైజాగ్ ఎకనమిక్ రీజియన్ పరిధిలోని 9 జిల్లాల్లో చేపట్టే 49 ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ ప్రణాళికపై ఈ సందర్భంగా చర్చించారు. విశాఖ ప్రాంతంలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను లోకేష్ కు సంబంధిత అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడంలో ఐటీ, ఐటీ సేవల వాటా 10 శాతంగా ఉండాలని అన్నారు .   విశాఖలో 10 గిగావాట్ల మేర డేటా సెంటర్ల ఏర్పాటుకు మూమెంటం వచ్చిందని తెలిపారు. జీసీసీలు, ఐటీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌