Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

చంచల్‌గూడ జైల్ కి వెళ్లి ఎన్ఎస్ యూఐ నేతలను పరామర్శించిన రాహుల్…!

తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు చంచల్ గూడ జైలుకు వెళ్లారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలను పరామర్శించారు. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ పర్యటనకు అనుమతిని నిరాకరించడంతో ఎన్ఎస్యూఐ నిరసన చేపట్టింది. దీంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తొలుత ఆయనకు అనుమతిని ఇవ్వని సంగతి తెలిసిందే. అయితే, కాంగ్రెస్ నేతలు మరోసారి విన్నవించడంతో చివరకు అనుమతి లభించింది.

కాంగ్రెస్ నేతల అభ్యర్ధన మేరకు ములాఖత్ కు రాహుల్ గాంధీకి అనుమతిని ఇచ్చినట్టు జైళ్ల శాఖ డీజీ జితేందర్ తెలిపారు. అయితే రాహుల్ తో పాటు జైలు లోపలకు వెళ్లడానికి కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతిని అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ తో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఈరోజు మధ్యాహ్నం జైలుకు వెల్లి ఎన్ఎస్ యూఐ నేతలను కలుసుకున్నారు.

RSS
Follow by Email
Latest news