Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

పోటీ చేసిన రెండు చోట్లా సత్తా చాటిన రాహుల్ గాంధీ

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సత్తా చాటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ కంచుకోట అయిన ‘రాయ్‌బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి, భాజపా నేత దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌పై 3.88 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అలాగే తన సిట్టింగ్‌ స్థానమైన కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేశారు. సీపీఐ అభ్యర్థి అనీ రాజాపై 3.64 లక్షల ఓట్ల ఆధిక్యం సాధించారు.

తాజా ఫలితాలతో రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ కంచుకోటగా మరోసారి రుజువైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడినుంచి మూడుసార్లు గెలిచారు. అంతకుముందు ఆమె భర్త ఫిరోజ్‌గాంధీ రెండుసార్లు విజయం సాధించారు. ఇక 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆమె రాజ్యసభకు వెళ్లడంతో.. చివరి క్షణంలో రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేశారు. రాహుల్ పోటీచేసిన రెండు చోట్ల గెలుపొందారు. దీంతో ఆయన ఏ స్థానాన్ని వదులుకుంటారు అనే అంశం ఆసక్తిగా మారింది.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌