Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

పవర్ స్టార్  పవన్‌ కళ్యాణ్ షూటింగ్ లతో ఫుల్ బిజీ..!

పవర్ స్టార్  పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలకు కొంత బ్రేక్ ఇచ్చి సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.  వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ లను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకే చేసిన వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో ఉన్నారు. మరో వారం రోజులపాటు ఈ షూటింగ్ జరుగుతుందని ఇండస్ట్రీ టాక్.

అనంతరం సాహో డైరెక్టర్‌ సుజీత్‌ కాంబినేషన్‌లో ఒరిజినల్‌ గ్యాంగస్టర్‌ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాత డివీవీ దానయ్య నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంచిన పూజా కార్యక్రమాలు నిర్వహించిన  విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈచిత్రాన్ని తెరక్కిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా వచ్చే వారం నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ముంబైలో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ జరగనుందని సమాచారం అందుతుంది. ముంబైతో పాటు కొన్ని ఫారన్ లొకేషన్ లలో షూటింగ్ పూర్తిచేస్తారని సమాచారం. అయితే, ఇప్పటి వరకు హీరో, డైరెక్టర్, నిర్మాత, సంగీత దర్శకుడు మినహా సినిమాకు సంబంధించి ఇతర వివరాలు ఇంకా బయటకు రాలేదు.

ఇకపోతే, సముద్రఖని దర్శకత్వంలో… పవన్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’ ఈసినిమాకి  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, ఏయం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత పూర్తి అయ్యింది. పస్తుతానికి శరవేగంగా జరుపుకుని జూలై 28న విడుదల చేస్తున్నట్లు ఆచిత్రం యూనిట్ అనౌన్స్ చేశారు.

RSS
Follow by Email
Latest news