Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మరోసారి వివాదంలో చిక్కుకున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో కూడా తిరుమల లడ్డూ వివాదం సమయంలో ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు తాజాగా లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. రామలక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని, అవి కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచాయని నోటీసులో పేర్కొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తరఫు న్యాయవాది ఈ లీగల్ నోటీసులను పంపారు. తమ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా స్పందించకపోయినా లేదా క్షమాపణలు చెప్పకపోయినా.. రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేస్తామని హెచ్చరించారు.

RSS
Follow by Email
Latest news