Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు పొంగులేటి

దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ప్రజలను హిప్నటిజం చేయడంలో అయన దిట్టా అని అన్నారు. ఆదివారం పాలేరులో జరిగిన అత్మీయ సమావేశంలో కేసీఆర్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయనుకుంటే… పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిందన్నారు. రాష్ట్రం కోసం బలిదానులు చేసుకున్న యువకుల త్యాగాలకు విలువ లేకుండా పోయిందన్నారు.

ప్రభుత్వం ఏ ఒక్క వాగ్థానాన్ని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గిరిజన బంధు , దళిత బంధు , డబుల్ బెడ్ రూం ఇండ్లలో లోపాలున్నాయన్నారు. బడ్జెట్లో ప్రకటించిన విధంగా నిధుల కేటాయింపులు జరగడం లేదని వాపోయారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు. జెండా ఏదైనా బీఆర్ఎస్‌ను గద్దె దించటమే తన అజెండా అని చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులను గద్దె దించటం తన లక్ష్యమని అన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ శాఖ  భావిస్తుందని పొంగులేటి ఆరోపించారు.

RSS
Follow by Email
Latest news