Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్డ్ విడుదల..!

తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – ‘‘POLYCET-2022’’ కు సంబంధించిన నోటిఫికేషన్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరంలో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ పరీక్షకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – ‘‘POLYCET-2022’’ కు సంబంధించిన నోటిఫికేషన్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు.

ఈ ఏడాది టెన్త్ చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరంలో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ పరీక్షకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 9 (సోమవారం) నుంచి జూన్‌ 4 వరకు అందుబాటులో ఉంటాయని పాలిసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ వెల్లడించారు. జూన్‌ 5 వరకు రూ.100 ఆలస్య రుసుముతో అప్లయ్‌ చేసుకోవచ్చని తెలిపారు. అదేనెల 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని శ్రీనాథ్‌ తెలిపారు. 12 రోజులకు ఫలితాలను విడుదల చేస్తామని అయన వెల్లడించారు.

పాలిసెట్‌ ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీ, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు‌, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, యానిమల్‌ హస్బెండరీ, ఫిషరీస్‌ కోర్సులు, బాసరలోని ఆర్జీయూకేటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీటెక్‌) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

పదో తరగతి పూర్తి చేసిన, ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న వారంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంతే కాకుండా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ)లో సీట్లను సాధారణంగా ప్రభుత్వ పాఠశాల‌ల్లోని విద్యార్థులు సాధించిన పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారనే విషయం తెలిసిందే.

అయితే గతేడాది ఎస్సెస్సీ పరీక్షలు జరగకపోవడంతో పాలిసెట్‌ ర్యాంక్‌ల ద్వారా సీట్లను భర్తీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పాలిసెట్‌ ద్వారానే ఆర్జీయూకేటీ సీట్లను భర్తీ చేయనున్నా రు.

RSS
Follow by Email
Latest news