Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కలం సైనికులు.. మన జర్నలిస్టులు..!

● వార్త సమాజాన్ని జాగృతం చేస్తుంది.
● కరోనా సమయంలో మీ సేవలు అమూల్యం.
●- జర్నలిస్టుల నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా నిలిచింది.
● జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
● సమాజాన్ని జాగృతం చేయడంలో కవులు, కళాకరులది ముఖ్యమైన పాత్ర.

హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్ఎస్ఎన్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ జర్నలిస్టులకు, కవులకు అవార్డుల ప్రదానోత్సవ సభ జరిగింది. ఆసభలో పలువురు వక్తలు మాట్లాడారు. జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి మాత్రమే కాదు. సమాజం పట్ల ఒక బాధ్యత. ఆ బాధ్యత గల వారిని గుర్తించి గౌరవించడం శుభ పరిణామం అన్నారు. మీడియా అంటే కేవలం వార్తలు కాదు. ఒక గొప్ప సామాజిక మార్పు కోసం మీడియా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందని కొనియాడారు.. ప్రజలను చైతన్య పరుస్తూ ఉంటుంది. మానవీయ కథనాలు రాసిన అనేక మంది జర్నలిస్టులకు వారు అభినందనలు తెలిపారు.

ఇటీవల కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసినప్పుడు.. ప్రపంచం మొత్తం లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సందర్భంలో జర్నలిస్టులు మాత్రం ఫీల్డ్ లోనే ఉన్నారు. కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో, ప్రభుత్వాలను అధికారులను అప్రమత్తం చేయడంలో, లక్షల మంది ప్రాణాలను కాపాడడంలో మీడియా అత్యంత కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను క్షణాల్లో ప్రజలకు చేర్చింది. ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూపించింది. ఈ క్రమంలో ఎంతోమంది మీడియా మిత్రులు కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు వదిలారు. అయినా జర్నలిస్టులు తమ సామాజిక బాధ్యతను విస్మరించలేదు. కరోనా వారియర్లుగా నిలిచిన జర్నలిస్టులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి పేరుతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేశారు. ఈ నిధికి సుమారు రు. 42 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించారు. దాదాపు 4వేల మంది మీడియా మిత్రులకు ప్రభుత్వం 5.60 కోట్ల రూపాయలను అందజేసింది. జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి ఇప్పటి వరకు 16 కోట్ల 11 లక్షల రూపాయలను ఆర్థిక సాయం గా ప్రభుత్వం అందజేసిందని అన్నారు.

కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ సభ్యులు, ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ట్రస్టీ సత్యనారాయణ గారు, సీనియర్ పాత్రికేయులు రామ చంద్ర మూర్తి గారు, ఐజేయు అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి గారు, టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రెటరీ విరహత్ అలీ గారు, తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు నందిని సిధా రెడ్డి గారు, బెవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ దేవి ప్రసాద్ రావు గారు, టీఎస్పీఎస్సీ సభ్యులు కారెం రవీందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news