Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హడావుడిగా కాకుండా అధ్యయనం చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి : సీఎం కేసీఆర్

మునుగోడు ఉప ఎన్నికపై ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలతో సీఎం కేసీఆర్ వరుసగా భేటీలు అవుతున్నారు. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, వాటి ఫలితాలను ప్రస్తావిస్తూ.. మునుగోడులో ఎలా ముందుకు సాగాలనే అంశంపై వారు సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది. గతంలోలా హడావుడిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు సమాచారం.

తాజాగా టీఆర్‌ఎస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నల్గొండ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డి.రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులతో శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రెండు విడతలుగా సుమారు 6 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. ఉప ఎన్నికకు సంబంధించి క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన సమాచారం, అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్