Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లో 99కి చేరిన అరెస్ట్ ల సంఖ్య

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ అంశం గతేడాది అక్టోబర్ నెలలో జరిగిన విషయం తెలిసిందే. దీంతో మిగితా పలు పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. పేపర్ లీకేజీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ని ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే 96 మంది నిందితులను అరెచేశారు. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. దింతో నిందితుల సంఖ్య 99కి చేరింది. మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులను ఈడీ విచారించింది.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు అరెస్టయి జైలులో ఉన్నారు.తాజాగా బుధవారం అరెస్ట్ అయిన  ముగ్గురు కూడా ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌ కు సమీప బంధువులని తెలిసింది. ముగ్గురు నిందితులు ప్రవీణ్‌కు సహకరించినట్లు సిట్ అధికారుల  దర్యాప్తులో  తేలినట్లు సమాచారం. ఈ క్రమంలో సిట్ అధికారులు సప్లిమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేయనున్నట్లు సమాచారం.

RSS
Follow by Email
Latest news