Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

కొత్త కుర్రాడు “జయంత్” హీరోగా “నెల్సన్”

జయంత్ ఇన్ అండ్ యాజ్
జె.కె.మూవీస్ ప్రొడక్షన్ నంబర్-1
“నెల్సన్” మొదలయ్యెన్!!

యువ ప్రతిభాశాలి సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో… కత్తిలాంటి కొత్త కుర్రాడు “జయంత్”ను హీరోగా పరిచయం చేస్తూ జె.కె.మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1 గా తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా “నెల్సన్” పూజా కార్యక్రమాలతో సంస్థ కార్యాలయంలో మొదలైంది. ఉత్కంఠభరిత కథాంశంతో స్టైలిష్ మేకింగ్ తో రూపొందనున్న ఈ చిత్రంలో అనుషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లు. ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు.


త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వైజాగ్, హైదరాబాద్ లలోనూ చిత్రీకరణ జరుపుకోనుంది. ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, ‘పుష్ప’ ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు.బి ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సౌండ్ ఎఫెక్ట్స్: పురుషోత్తమరాజు, పాటలు: కాసర్ల శ్యామ్-మనోజ్-గిరి-జయంత్-సాయి సునీల్, సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: శివ దేవరకొండ, ఫైట్స్: శివ్ రాజ్, ఎడిటర్: ఎమ్.ఆర్.వర్మ, నిర్మాత: జయంత్ కార్తీక్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల!!

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌