నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈరోజు గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక వైద్యం అందించిన తరువాత మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించను న్నట్లు సమాచారం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఆమంచర్ల గ్రామంలో పర్యటించారు. సమాచారం అందుకున్న వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఫోన్ లో యోగ క్షేమాలు తెలుసుకున్నారు. అలాగే అపోలో వైద్యులు, MCS రెడ్డికి కాల్ చేసి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్థితిపై అరా తీశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే ఆనం ఆకాంక్షించారు.
