Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

నందమూరి తారకరత్న దశ దిన కర్మ…హాజరైన సినీ , రాజకీయ ప్రముఖులు

నందమూరి తారకరత్న దశ దిన కర్మ ఈరోజు ( మార్చి 2వ తేదీన) ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడారు. చివరికి ఫిబ్రవరి 18 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయన మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి శ్రేణుల్లో విషాదం నెలకొంది.

తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు , పురందరేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు హాజరై తారకరత్న కు నివాళ్లు అర్పించారు.

RSS
Follow by Email
Latest news