ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలంలో గల మిలిటరీ మాధవరం గామాన్ని ఆదర్శంగా చేసుకొని శ్రీ ధరణి ఆర్ట్స్ పతాకం పై Mr. సోల్జర్ అనే చిన్ని తెరకెక్కించారు నిర్మాతలు VRM పట్నాయక్ USN పట్నాయక్ లు. ఈ చిత్ర నిర్మాణానికి మిలిటరీ గ్రామా మాజీ సైనికొధ్యుల సంఘం, మరియు మిలిటరీ మాధవరం గ్రామ సర్పంచ్, ప్రజలు పూర్తీ సహకారం అందించారని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. వారికి శ్రీ ధరణి ఆర్ట్స్ సంస్ద తరుపున అభినందనలు తెలియ చేస్తున్నామని అన్నారు.
Mr. సోల్జర్ ( ఫ్రమ్ మిలటరీ మాధవరం) సెన్సార్ పూర్తి చేసుకొని ఆగస్టు 2 వ వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. భారత దేశం రాజధాని ఢిల్లీ లో ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఊరు ఈ మిలిటరీ మాధవరం గ్రామం. ఈ గ్రామ నుంచి మొదటి, రెండవ ప్రపంచ ముద్దంలో సుమారు 2,000 మంది సైనికులు పాల్గొని దేశానికి ఎంతో సేవలను అందించి, సుమారు పదుల సంఖ్యలో ఆశువులు బాసారు. దేశ స్వతంత్రమం అనంతరము దేశ రక్షణలో బాగంగా సుమారు 500 మంది సైనికులు ప్రస్తుతము ఇండియన్ ఆర్మీ రక్షణ రంగం లో చేరి సేవలు పొందిస్తున్నారు.
1970 వ సంవత్సరంలో మేజర్ రాజు అనే ఆర్మీ ఆఫీసర్ ఎంతో మంది శత్రువులను సంహారించి, ఎన్నో పతకాలు పొంది ఉన్నారు. అలాంటి మేజర్ రాజు నిరాధార ఆరోపలు ఎదుర్కొని, అవమానాలను భరించలేక భారతమాత సాక్షిగా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నారు. కానీ యీ నాటికి ఆ గ్రామంలో మేజర్ రాజు కనబరిచిన ధైర్యసాహసాలు నేటి యువతను ప్రేరేపిస్తూ.. ప్రతి ఇంటి నుండి ఒకరినైనా ఇండియన్ ఆర్మీకి పంపించాలనేది ఆ గ్రామస్తుల నమ్మకం .
ఒక వేళ ఆకస్మిక యుద్ధం వస్తే దేశ రక్షణకు ప్రతి గ్రామం నుండి పదుల సంఖ్యలో సైనికులు ఇండియన్ ఆర్మీ లో చేరవలసిన సమయం ఆసన్న మైందని… కథా సారాంశం తో జరిగిన యదార్ధ కథను ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మాకు చాలా గర్వాంగా ఉందని శ్రీ ధరణి ఆర్ట్స్ అధినేతలు తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి, ఆదరించి మా సంస్థ బృందాన్నీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.











