Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సినీ రంగంలోకి మిస్పా మూవీ మీడియా..!

మిస్పా మూవీ మీడియా సంస్థ తాజాగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో అనుభవం ఉన్నటువంటి ఈ సంస్థ ఎంతో మంది పాఠకుల మన్ననలను  చూరగొంది.  ప్రేక్షకులను మెప్పించడానికి తాజాగా సినీ రంగంలోకి ప్రవేశించింది. మిస్పా మూవీ మీడియా బ్యానర్ లో నూతన చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంది. నూతన చిత్రానికి సంబంధించి ఇటీవలే కడప నగరంలో లాంఛనంగా ప్రారంభమైంది.

ఈసందర్బంగా ఆ సంస్థ అధినేత చిన్న తోట పద్మాకర్ రావు మాట్లాడుతూ… ఈ మూవీలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్ లు ఉంటారని తెలిపారు. అలాగే ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నాని అన్నారు.  తాము తీయబోయే ఈ నూతన చిత్రం ఒక డిఫరెంట్ స్టోరీ తో తెరకెక్కించనున్నామని వివరించారు. ఈ సినిమాలో చాలా త్రిల్లింగ్, ఎంటర్ టైన్మెంట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించనున్నట్లు అయన వెల్లడించారు. త్వరలోనే సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ ప్రారంభం కానుందని అయన వెల్లడించారు.

ఈ సినిమాలో హీరోలుగా భద్ర, చిన్నతోట పద్మాకర్ రావు, హీరోయిన్స్ గా నేహా , అంజలి, విలన్ గా దుంపల యల్లారెడ్డి లు నటించనున్నారు. ఈ చిత్రానికి కథ మాటలు ఉప్పలపాటి శివ రాయగా, సినిమాటోగ్రఫీ జాకట రమేష్, ఎడిటర్ అమృత రాజు, నిర్మాతలు చిన్నతోట పద్మాకర్ రావు, ఆర్.సువర్ణ, దర్శకత్వం  చిన్నతోట పద్మాకర్ రావు.

RSS
Follow by Email
Latest news