Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మే ఒకటిన సినీ కార్మిక దినోత్సవ సంబరాలు

మే ఒకటిన హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీలోని అన్ని విభాగాల (24 క్లాప్స్ తో కలిసి మేడే ఉత్సవాలు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై. ట్రెజరర్ సురేష్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలతోపాటు
ఫెడరేషన్ కు సంబందించిన మెంబర్స్ పాల్గొ న్నారు.

ఈ సందర్భంగా ఇటీవలే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన కొల్లి రామకృష్ణను శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా కార్మిక దినోత్సవం బ్రోచర్ ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొల్లి
రామకృష్ణ విడుదల చేయగా, ఈవెంట్ టీ షర్ట్ ను తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసారు.

RSS
Follow by Email
Latest news