Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

మేక్ ఎ విష్` చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

కిరణ్ కస్తూరి నిర్మాన సారథ్యంలో, సంధ్య బయిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మేక్ ఎ విష్`ఈ చిత్రం ఆకాం ఫిలిమ్స్  బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సస్పెన్స్ డ్రామాతో మంచి ఎంటర్ టైన్మెంట్, త్రిల్లింగ్ గా ఉంటుందని చిత్ర నిర్మాత, డైరెక్టర్ లు తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్రసన్న కుమార్ గారు, రామసత్యనారాయణ, అలాగే ఈ చిత్ర నిర్మాణ, నిర్వహణ గా ఉన్న భవాని శ్రీను ( ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ) పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారి చేతుల మీదుగా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

ఈ సందర్బంగా చిత్ర  దర్శకుడు,నిర్మాత మాట్లాడుతూ… స్టోరీ మొత్తం ముగ్గురు స్త్రీల కు సంబందించి చాల ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అన్నారు. వారి ప్రేమ కార్యకలాపాల్లో ఎదురైన సందర్భాలు… ప్రేమ ఫలించేందుకు వారు పడిన ఇబ్బందులు, వారి సంబంధాల సమస్యల చుట్టూ తిరుగుతుందని వారు వివరించారు. కథ మొత్తం వారి జీవితంలోకి చొరబడిన వ్యక్తితో టైమ్‌లైన్‌లో ముందుకు వెనుకకు తిరుగుతూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం వాషింగ్టన్ డీసీ, యు ఎస్ ఎ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జరిగిందని వివరించారు. ఇటీవలే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో మీ ముందుకు రాబోతుందని కస్తూరి కిరణ్ తెలిపారు.

నటీనటులు : సంధ్య బాయిరెడ్డి, కిరణ్ కస్తూరి, భవాని శ్రీను: అభిషేక్ సబ్బే, వరుణ్ వేగినాటి, కార్తీక్ కందాల,
స్టోరీ : కిరణ్ కస్తూరి & సంధ్య బయిరెడ్డి,
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రణీత్ మ్యూజికల్,
సినిమాటోగ్రఫీ : మహావీర్ అభిమన్యు & అడ్రిఎన్ రిలే,
ప్రొడ్యూసర్ : కిరణ్ కస్తూరి,
డైరెక్టర్ : సంధ్య బయిరెడ్డి,
నిర్మాణ నిర్వహణ : జి శ్రీనివాస్ (భవాని శ్రీను)
పి ఆర్ ఓ : సి హెచ్ : రాంబాబు ( సినిమా బజార్ )

RSS
Follow by Email
Latest news