Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హక్కులు ఇస్తామని అమ్ముకుంటున్న కేసీఆర్

* అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ABS వ్యతిరేకిస్తోంది
* వెంటనే అసెంబ్లీలో లో ఇచ్చిన మాటను నిలుపుకోవాలి
* అసైన్డ్ భూముల పై రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వీరమించుకోవాలి
*రాష్ట్ర ఖజానా లేకపోతే పేదల అసైన్డ్ భూములు అమ్మి రాష్ట్ర ఖాజాన నింపటం దౌర్భాగ్యం
* ధనిక రాష్ట్రమని నమ్మించి అసైని రైతుల రక్తం తాగుతున్న సర్కార్ పై అసైనీ రైతులు ఉద్యమించాలి
* పేదల భూములు ధనికులకు అమ్మి పేద రైతుల కుటుంబాలను విచ్ఛిన్నం చేసినట్టే.
* అసైనీ రైతుల పట్ల ప్రతీ పక్షాలు చూసి చూడనట్లు ఉంటున్నాయి
*తెలంగాణ వస్తే నిధులు వస్తాయి అంటే మన భూములే అమ్ముతాడు అని గ్రహించలే
* అసైనీ రైతులు ఉద్యమించకపోతే ఇక అధోగతే

తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడతామని నీళ్లు ,నిధులు ,నియామకాలు వస్తాయని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి గద్దెను ఎక్కిన కేసీఆర్ అసలు రంగు ఇప్పుడు బయట పడుతుందనిప్రసిడెంట్ కలకోటి మహేందర్డ ర్ ఆరోపించారు.  తాజాగా అసైన్డ్ భూమూల బాగోతం ఇందుకు నిదర్శనం అన్నారు. నిధులు వస్తాయని ఆ రోజూ ఇంత స్పష్టంగా చెప్పి ఉంటే తెలంగాణ ఉద్యమం వేరేలా ఉండేడని అన్నారు.

అసైన్డ్ భూముల పై పూర్తి హక్కులు ఇస్తామని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలో మార్చి 23 – 2021 లో KCR చెప్పినాడని,   తాను ఇచ్చిన వాగ్దనం కు రివర్స్ గా ఇప్పుడు ఆ భూములను అమ్ముకుని ఖజానా నింపుకోవాలని కుట్ర పన్నుతున్నాడని మహేందర్ ఆరోపించారు. రాష్ట్ర ఖాజాన ఖాళీ అయితే అదే అసైన్డ్ భూముల్ని అమ్మి పరిపాలన చేయలనుకుంటున్నాడు. దీనంత పచ్చి మోసం మరొకటి లేదు. KCrకు గుణపాఠం తప్పక తప్పదు అన్నారు. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందో లేదో అర్ధం కావడం లేదన్నారు.

అసైనీ రైతుల సమస్యల పై ప్రతిపక్షాల విషయానికి వస్తే వారికి సరైన అవగహన లేదని అన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ ఇచ్చిన మాటను కూడా వారు గుర్తించలేదంటే…వారు ఎంత మొద్దు నిద్రలో ఉన్నారో స్పష్టం అవుతోందని విమర్శించారు. ప్రభుత్వం పేదల,పేద రైతుల అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్ముకోవటాన్నీ అందుకోసం 30 వేల ఎకరాలను సర్వే చేసి గుర్తించటాన్ని అసైన్డ్ భూమి సమితి ABS నిరసిస్తుంది.

ఒక నిర్దిష్టమైన ఆలోచన లేకుండా…రాష్ట్ర ఖాజాన ఖాళీ చేసి, ఇప్పుడు అది నింపుకోవడానికి, నిధుల వేటలో భాగంగా…గతంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారము చేయటం సిగ్గుచేటు అని ఆరోపించారు. ఒక జలగ లాగ…పేదల భూములు అమ్ముకొని వారి రక్తం తాగుతున్నాడని, విమర్శించారు. అధికారం ఉందని ఇలా విచ్చలవిడిగా ఉపయోగిస్తే … రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారన్నారు.

పేదల భూములు ఎకరాలకు ఎకరాలు గుంజుకోని, గుంటో ,రెండు గుంటలో ఇస్తామని చెప్తున్నారు అంటే వారి మోసపూరిత వాగ్దానం కు అమాయక అసైనీ రైతులు ఎంత మోసపోతున్నారో తెలుస్తుంది. అసైనీ రైతులు చైతన్యం కలిగి ఉద్యమిస్తే వారికి పూర్తి హక్కులు వస్తాయి ఇదే అదునుగా కానీ ఆ దిశగా ఆలోచించే చైతన్యం పేద రైతులకు లేదు. ఉన్న కొట్లాడలేము అన్న మానసిక భావ దారిద్ర్యంలో పేదలు ఉన్నారు. కావున ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రజల పక్షాన ఉద్యమించాలని మహేందర్ పిలుపునిచ్చారు.

RSS
Follow by Email
Latest news