కెసిఆర్ ప్రభుత్వం గత వారం రోజులుగా గా ధర్నాలు రహదారుల దిగ్బంధం నిరసన పేరుతో డ్రామాలు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ విమర్శించారు. వరి ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కెసిఆర్ ప్రకటించడంతో టిఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఉంటుందని అలాంటప్పుడు కెసిఆర్ నిర్ణయం లో కొత్తగా ఏముంది అని యాదవ్ ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడం కోసం టిఆర్ఎస్ బిజెపి పార్టీలు పోటి ధర్నా చేసి ప్రజలను మోసం చేయా డానికి పోటీ పడ్డారని ఆరోపించారు. ప్రకటించిన విధంగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి మద్దతు ధర కు దాన్యం కొనుగోలు చేయాలని అయన డిమాండ్ చేశారు