Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు…ఢిల్లీ లిక్కర్ స్కామ్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) అధికారులు ప్రస్తావించారు. 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత పేరు మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. రిమాండ్ రిపోర్టు ప్రకారం రూ. 100 కోట్ల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించింది.

ఈ సౌత్ గ్రూప్ ను కవిత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట నియంత్రించారు. సౌత్ గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లను విజయ్ నాయర్ కు చేర్చారు. విచారణ సందర్భంగా ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా వీటిని ధ్రువీకరించారు.

ఈ వ్యవహారంలో కార్యకలాపాలకు కవిత ఉపయోగించిన 10 సెల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఉంది. సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు  గుర్తించినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో 36 మంది రూ. 1.38 కోట్ల విలువైన 170 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో రెండు నంబర్లతో 10 ఫోన్లను కవిత వాడారని ఈడీ పేర్కొంది.

RSS
Follow by Email
Latest news
గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర.. : పాడి కౌశిక్ రెడ్డి నితిన్ నటించిన సినిమా ట్రైల‌ర్ రిలీజ్.. మీకు ఓటర్ స్లిప్పులు అందలేదా... అయితే ఇలా చేయండి...! దొర‌ల తెలంగాణ పోవాలి… ప్ర‌జ‌ల తెలంగాణ రావాలి.. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ.. రెండు రోజులు పొడిగింపు... బీఆర్ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు...! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య ఒప్పందం తెలంగాణలో నేటితో ముగియనున్న ప్రచారం.. ప్రధాన పార్టీల నేతల చివరి ఈరోజు ప్రచారం..! ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? : టీపీసీసీ చీఫ్ రేవంత్