Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు : జేపీ న‌డ్డా

తెలంగాణ‌లోని టీఆర్ఎస్ స‌ర్కారుపై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింద‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో అతి పెద్దదైన కాళేశ్వ‌రం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారింద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర స‌మితి కాద‌ని, తెలంగాణ రజాకార్ స‌మితి అని కూడా మ‌రింత ఘాటు ఆయన వ్యాఖ్య‌లు గుప్పించారు.

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర తొలి ద‌శ పూర్తయిన సంద‌ర్భంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌ అయన పాల్గొన్నారు. ఈసందర్బంగా తెలంగాణ ప్ర‌భుత్వంపై అలాగే, టీఆర్ఎస్‌పై, సీఎం కేసీఆర్‌పైనా తీవ్రంగా విమర్శలు చేశారు.

RSS
Follow by Email
Latest news