Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి… ఇండ్ల స్ఠలాల కోసం రిలే దీక్షలు -TWJF

దీర్గకాలికంగా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది . ఇండ్ల స్ఠలాల పై వెంటనే ప్రభుత్వం వెంటనే ఖరారు చేయాలని విఙ్ఞప్తి చేశారు . రాష్ట్ర కేంద్రం హైద్రాబాద్ తోపాటు అన్ని జిల్లా కేంద్రాలు , నియోజకవర్గ కేంద్రాలు , మండల కేంద్రాల్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్తలాలు మంజూరు చెయ్యాలని కోరారు.

సమస్యల పరిష్కారం కోసం ఈనెలాఖరులో హైదరాబాద్ లో మూడు రోజుల పాటు నిరసన దీక్షలు చేపట్టాలని తెలంగాణ ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం తిర్మాబించింది. హైదరాబాద్లొని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలోసోమవారం జరిగిన ఈ సమావేశానికి ఫెడరేషన్ రాష్ట్ర అద్యక్షులు మామిడి సోమయ్య అద్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య గత కార్యకలాపాలపై నివేధిక ప్రవెశపెట్టారు. భవిశ్యత్ ఎజెండాను ప్రతిపాదించారు. వివిధ అంశాలపై చర్చించి పలు తీర్మానాలను ఆఫిస్ బేరర్ల సమావేశం ఆమోదించింది .

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ హైద్రాబాద్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని , ఈ దీక్షల్లో అన్ని జిల్లాల బాధ్యులు, జర్నలిస్టుల పాల్గొంటారని తెలిపారు. ఇండ్ల స్ఠలాల సమస్య గత 35 సంవత్సరాలుగా రాష్ట్రంలో పెండింగు లో ఉందని గుర్తు చేశారు . ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటనల సందర్బంగా అనేక చోట్ల హమీలు ఇచ్చారని చెప్పారు . హైద్రాబాద్ ,రంగారెడ్డి , మహబూబ్నగర్ , కరీంనగర్ , వరంగల్ , నల్లగొండ , ఖమ్మం , నిజామాబాద్ , భద్రాద్రి -కొత్తగూడం , మెడ్చల్ -మల్కాజిగిరి , యాదాద్రి -భువనగిరి తోపాటు ఇతర జిల్లాల్లోని జర్నలిస్టుల ఫైల్స్ ఇప్పటికే సీఎంఓ లోనూ , ప్రభుత్వంలోని అయా సెక్షను లలో ఉన్నాయని వివరించారు.

వెంటనె వాటిని పరిష్కరించాలని కోరారు .అలాగే హౌసింగు సొసైటీలతో సంబంధం లేకుండా హైద్రాబాద్ లో అనేక మంది జర్నలిస్టులూ ఇండ్ల స్ఠలాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్నారని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల సమస్యను పార్లమెంటు సమావేశాల్లో చర్చకు పెట్టి రైల్వే పాస్ లను పునరుద్దరింపజేయాలి కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులకు వినతిపత్రాలు సమర్పించాలని సమావేశం తీర్మానించిందని వారు పేర్కొన్నారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డులు ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రుల్లో సరిగా పనిచేయడం లేదని, ఈ సమస్యపై వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కలవాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అలాగే ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఫిబ్రవరి 5న నిర్వహించాలని, అదేవిధంగా త్వరలో రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఈ ఆఫిస్ బేరర్ల సమావేశంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, ఎల్గొయి ప్రభాకర్, తాటికొండ కృష్ణ, బండి విజయ్ కుమార్, వల్లాల జగన్,బి దయాసాగర్,పి రాధిక , కార్యదర్శులు ఎర్రం నర్సింగ్ రావు, ఎస్ కే సలీమా, ఈ.చంద్రశేఖర్,తన్నీరు శ్రీనివాస్, గుడిగా రఘు, బి రాజశేఖర్, బి జగదీష్, గండ్ర నవీన్, కె నిరంజన్, బి దామోదర్, పి బిక్షపతి, కుంచె వెంకటేష్, కోశాధికారి ఆర్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news