Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

బీజేపీ నాయకులు కేంద్రానికి చెబితే నన్ను అరెస్ట్ చేస్తారా? కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిన నేపథ్యంలో…. తర్వాత అరెస్ట్ కవితదే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై కవితను మీడియా ప్రశ్నించింది.

అందుకు కవిత బదులిస్తూ… రాష్ట్ర బీజేపీ నాయకులు చెబితే నన్ను అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అలా చేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. అరెస్ట్ గురించి ఏ దర్యాప్తు సంస్థ చెప్పాలో ఆ సంస్థే చెప్పాలి. అంతే కానీ రాష్ట్ర బీజేపీ నేతలు కాదు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని బీజేపీ నేతలు తెలుసుకోవాలి” అని కవిత హితవు పలికారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈమేరకు భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నామని. కవిత తెలిపారు.  అలాగే, దేశంలో బీసీ గణన కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు.

RSS
Follow by Email
Latest news