Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదల

హీరో విజయ్ అభిమానుల కు గుడ్ న్యూస్… ఈ రోజు తమిళ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జన నాయగన్‌’ ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాను తమిళ, తెలుగు రెండు భాషల్లో నిర్మిస్తున్నారు. తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకుడు’ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా పేరుకు తగ్గట్టుగానే,  బలమైన రాజకీయ సందేశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ తమిళనాట పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సందర్బంగా,  తరుణంలో విడుదలవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ఫుల్ డైలాగులు, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఉన్నాయని సినీవర్గాల టాక్. ఈ ట్రైలర్‌లో విజయ్ స్టైలిష్ ఎంట్రీ, తనదైన మార్క్ యాక్షన్, స్వాగ్‌తో కనిపించారు. ఆయన పలికిన డైలాగ్స్ అభిమానులను విశేషంగా అలరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా, దర్శకుడు హెచ్.వినోత్ తెరకెక్కిస్తున్నాడు.

విజయ్ కి జతగా పూజా హెగ్డే నటిస్తుండగా, మమితబైజు, బాబీ దేఓల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, ఒక బలమైన సామాజిక సందేశం ఉన్న కథ అని చెప్పక తప్పదు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె.నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

RSS
Follow by Email
Latest news
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట కేబినెట్ భేటీ తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ : సీఎం చంద్రబాబు అలాంటి ఓ వ్యక్తి మళ్లీ పుట్టడు.. ఆయన ఒక్కడు.. చరిత్రలో ఒకే ఒక్కడు..! సుందర్ స్థానంలో స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ఛాన్స్ .. భారత ఏకైక నటుడుగా ప్రభాస్ రికార్డ్ సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు.. రష్యా, చైనాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా మేము భారత్‌ కు వచ్చేది లేదు..... వేదిక మార్చాల్సిందేనంటున్న బంగ్లాదేశ్ సోషల్‌మీడియాను ఓ ఊపు ఊపేయనున్న ‘హుక్‌ స్టెప్‌’ సాంగ్‌