Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

హైదరాబాద్ లో కుండపోత వర్షం

హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలో 10 సెం.మీ. వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మెహదీ పట్నం, టోలిచౌకి, అత్తాపూర్ తో పాటు మాసబ్ ట్యాంక్, నాంపల్లి, అఫ్జల్ గంజ్ , హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్ , బంజారా హిల్స్ సహా అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.

అకస్మాత్తుగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, రోడ్లపై నుంచి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి.

RSS
Follow by Email
Latest news